Site icon Prime9

Asian Taraka Rama Theater: హైదరాబాద్‌లో ఏషియన్ తారకరామ థియేటర్‌ను ప్రారంభించిన బాలకృష్ణ

asian taraka rama theater re opened by Balakrishnan

asian taraka rama theater re opened by Balakrishnan

Asian Taraka Rama Theater: ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీ నాట వారివారి కుటంబ మార్కను చాటిచెప్పే విధంగా థియేటర్ల కూడా వెలుస్తున్నాయి. మొన్నామధ్య మహేష్ బాబు ఏఎంబీ (AMB) థియేటర్లను ఇటీవల అల్లుఅర్జున్ AAA థియేటర్లను ప్రారంభించారు. కాగా ఇక ఈ జాబితాలోకి నందమూరి ఫ్యామిలీ కూడా వచ్చి చేరింది. ఏషియన్ తారకరామ థియేటర్ పేరుతో కొత్తగా థియేటర్ను ప్రారంభించారు బాలకృష్ణ.

హైదరాబాద్ కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న తారకరామ థియేటర్ ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా పునర్నిర్మితమైంది. ఏషియన్ సంస్థ ఈ థియేటర్ ను తీసుకుని మరమ్మతులు చేసింది. తారకరామ థియేటర్ ఇప్పుడు ఏషియన్ తారకరామగా మారింది. ఏషియన్ తారకరామను ఈరోజు సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.

ఈ నెల 16 నుంచి ఇందులో సినిమాల ప్రదర్శన జరగనుంది. చాలా కాలంగా మూతపడి ఉన్న తారకరామ థియేటర్ ను దివంగత నేత సీనియర్ ఎన్టీఆర్ స్నేహితుడు, సినీ నిర్మాత నారాయణ్ కే దాస్ నారంగ్ మరమ్మతులు చేపట్టారు. కాగా తాజాగా ఆయన కుమారుడు సునీల్ నారంగ్ దానిని కొత్త టెక్నాలజీతో అద్భుతంగా తీర్చిదిద్దారు. థియేటర్లో 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్ ను అమర్చారు. 975 సీటింగ్ కెపాసిటీని 590కి తగ్గించారు. ప్రేక్షకులకు అభిరుచికి తగినట్టుగా రిక్లైనర్ సీట్లను, సోఫాలను ఏర్పాటు చేశారు.

అయితే అధునాతన థియేటర్లో ఈ నెల 16 నుంచి బొమ్మ పడనుంది.  ‘అవతార్ 2’ను సినిమాను ఈ థియేటర్లో ప్రదర్శించనున్నారు. ఇకపోతే సంక్రాంతికి విడుదల కానున్న బాలయ్య బాబు సినిమా ‘వీరసింహా రెడ్డి’ని కూడా ఇందులో ప్రదర్శించనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: రేయ్ ఎం చెబుతున్నావ్ డార్లింగ్ అంటున్న ప్రభాస్… వైరల్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ గ్లింప్స్ !

Exit mobile version