Site icon Prime9

Mudragada Name Change: ముద్రగడ పద్మనాభం పేరు మార్పు .. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం

Mudragada

Mudragada

Mudragada Name Change:కాపు ఉద్యమ నేత, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. అధికారికంగా ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చారు. ముద్రగడ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్‌ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలిస్తే.. తన పేరు మార్చుకుంటాను అంటూ ముద్రగడ సవాల్‌ చేశారు.. మాట ప్రకారం తాజాగా పేరు మార్చుకున్నారు.

ఫలితాల రోజునే ప్రకటించిన ముద్రగడ..(Mudragada Name Change)

పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ వంగాగీతపై 65,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో భాగం. బుధవారం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు కూడా స్వీకరించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముద్రగడ తాను సవాల్ చేసిన మేరకు తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటానని ప్రకటించారు. అనంతర పరిణామాల్లో ఆయన పేరు మారినట్లుగా ప్రకటన వెలువడింది.

Exit mobile version