Hyderabad: ఈనెల 19న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. సికింద్రాబాద్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకి, కాజీపేట రైల్వే కోచ్ ఓవరాలింగ్ వర్క్ షాప్ కు శంకుస్థాపన చేయనున్నారు.
పర్యటనలో భాగంగా రూ.7వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రతిష్టాత్మక వందేభారత్ ట్రైన్ ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి భూమిపూజ చేస్తారు. రూ. 1,850 కోట్ల వ్యయంతో 150 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమిపూజ చేస్తారు. రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న ‘రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు’ భూమిపూజ చేస్తారు. రూ. 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ. ల పొడవున నిర్మించిన డబుల్ లైన్ జాతికి అంకితం చేస్తారు.
ఐఐటీ హైదరాబాద్(Hyderabad)లో రూ. 2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను జాతికి అంకితం చేస్తారు. అదే రోజున పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. సికింద్రాబాద్‌లోని కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పరిశీలించారు. ప్రధాని రాక సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఇందులో భాగంగా సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను సందర్శించి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసులు, విచారణలతో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ ఉంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయవర్గాల్లో సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరో వైపు ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ సభ పెట్టే రోజున.. ఖమ్మం నుంచి బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇప్పటికే ఒప్పించింది. అయన పద్దెనిమిదో తేదీన తన అనుచరగణంతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/