Site icon Prime9

Minister KTR: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్… త్వరలోనే ట్యాబ్స్ పంపిణీ చేస్తామన్న కేటీఆర్

minister ktr to distribute tabs for inter students

minister ktr to distribute tabs for inter students

Minister KTR: ఇంటర్ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్ లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

రాజ‌న్నసిరిసిల్ల జిల్లాలోని ప్ర‌భుత్వ క‌ళాశాల విద్యార్థుల‌కు మంత్రి కేటీఆర్ తీపికబురు చెప్పారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా త్వ‌ర‌లోనే ట్యాబ్ లను పంపిణీ చేయ‌నున్న‌ట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఈ ట్యాబ్స్ ఎంతో ఉప‌యోగ‌పడతాయని పేర్కొన్నారు.ఈ ట్యాబ్స్‌లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే స్టడీ మెటీరియ‌ల్‌తో పాటు పోటీపరీక్షలకు కావాల్సిన సమాచారాన్ని సైతం పొందుప‌రిచిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. ఇచ్చిన హామీని నెర‌వేర్చుకునే స‌మ‌యం ఆస‌న్నం అవడం వల్ల సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ ట్యాబ్స్‌ను తానే స్వ‌యంగా పంపిణీ చేస్తాన‌ని ఆయన వెల్లడించారు. ఈ వార్తకు జిల్లాలోని విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ కేటీఆర్ సర్ అంటూ కృతజ్ఞతలు చెప్తున్నారు.

ఇదీ చదవండి: KCR: నామకరణానికి 9 ఏళ్లు నిరీక్షణ

Exit mobile version