Site icon Prime9

komatireddy Venkatreddy: కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిపాజిట్ రాదు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

komatireddy venkatreddy

komatireddy venkatreddy

komatireddy Venkatreddy: బీఆర్ఎస్, కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిపాజిట్ కూడా రాదన్నారు.మెదక్‌లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవదన్నారు. నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. అలాంటప్పుడు ఆయన ఏ మొహం పెట్టుకొని నల్గొండలో బస్సు యాత్ర చేపడుతున్నారని ప్రశ్నించారు.

త్వరలో తండ్రీకొడుకులు జైలుకెళ్లడం ఖాయం..(komatireddy Venkatreddy)

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయమన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని బ్రస్టు పట్టించిన సీఎం కేసీఆర్, మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి వేలకోట్లు సంపాదించారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను బ్రస్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీష్ రెడ్డి గురించి ఇక తాను మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోనని అన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజక వర్గాన్ని ఎన్నటికీ మరువనని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేస్తానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలలో తనను గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలను కోరారు.

Exit mobile version