Minister Komati Reddy Venkata Reddy: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ బూస్దాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కవిత జైలు కు వెల్లిందని , తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఉన్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ మాటలు అసహ్యం గా ఉన్నాయి..మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు,30 వేల ఉధ్యోగ నియామకాలు చేపట్టినందుకా రేవంత్ రెడ్డి ని కేటీఆర్ తిడుతున్నాడా అంటూ అయన ప్రశ్నించారు.
దర్గం చెరువు పై కేబుల్ బ్రిడ్జి కట్టి అబివృద్ది చేసామని చెప్తున్నారని అలా అయితే ఎయిర్ పోర్టు , పీవి ఎక్స్ ప్రెస్ వే లాంటివి కట్టిన మేమేమనాలని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఐఎఎస్ లను అందరినీ అందరిని పక్కన పెట్టి నలుగురు ఐఎఎస్ లను కేటీఆర్ ఎంకరేజ్ చేసారని ఆయన అరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ కు రెండు మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువే అని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయే తప్ప అభివృద్ది జరగలేదన్నారు. వైన్ షాపుల పేరు మీద గత ప్రభుత్వం 2500 కోట్లు రాబట్టిందని మంత్రి వెంకటరెడ్డి చెప్పారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామని దొడ్డు వడ్లకు ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్నారు. వచ్చే నెల 6,7,8 తేదీల్లో తాను, ,శ్రీధర్ బాబు విదేశీ పర్యటనకు వెడుతున్నామని తెలిపారు. వివిధ కంపెనీల తో భేటి అవుతామని చెప్పారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని అన్నారు. దీనితో తాము ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నామన్నారు. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ నేతలు అంతా కేఏ పాల్ లా తిరగాల్సిందేనని సెటైర్లు వేసారు. ఆర్ఎస్ ఎల్బీ బాధ్యత కేటీఆర్ కు ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచన లో ఉన్నారని తమకు తెలసిందన్నారు. వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కి బయపడి కేసీఆర్ అసెంబ్లీ కి రావడం లేదని అన్నారు.