Site icon Prime9

Dress code: ఏపీలో మెడికల్ స్టూడెంట్స్ జీన్స్, టీ షర్టులు ధరించకూడదు

Dress code

Dress code

Dress code: ఏపీలో మెడికల్ స్టూడెంట్స్ ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని ఆ రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టం చేసింది. అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా జీన్స్ ధరించకూడదని చెప్పింది. బోధనాసుపత్రులకు పంపిన సూచనల్లో ఈ డ్రస్‌ కోడ్‌ను ప్రస్తావించింది. ఇకపై మహిళా విద్యార్థులు చీరలు, లేదంటే చుడీదార్లు మాత్రమే ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్‌తో రావాలని, మహిళలైతే జుట్టును వదులుగా వదిలేయవద్దని సూచించింది. అలాగే, తప్పనిసరిగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే నిర్దేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తిలోదకాలివ్వడంతో గుర్తించిన అధికారులు.. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

మెడికల్ కాలేజీలకు పేషెంట్స్ వస్తే.. వారికి సహాయకులు లేరన్న కారణంతో వారిని చేర్చుకోవడం మానొద్దని సూచించింది. ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌.. బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు.

Exit mobile version