MLA Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి 3 కేసుల్లో బెయిల్ మంజూరు

ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్‌ మీద వున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కి మరో ఊరట లభించింది .మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది . దీనికి కూడా గతంలో విధించిన షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 04:02 PM IST

MLA Pinnelli Ramakrishna Reddy:ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్‌ మీద వున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కి మరో ఊరట లభించింది .మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది . దీనికి కూడా గతంలో విధించిన షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది. దీనిలో భాగంగా జూన్‌ 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది.పిన్నెల్లికి బెయిల్ ఇవ్వద్దని ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా హై కోర్ట్ మాత్రం బెయిల్ ఇచ్చింది .అభ్యర్థికి ఓట్ల కౌంటింగ్ రోజూ కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే హక్కువుందని కోర్ట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది .

జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దు..(MLA Pinnelli Ramakrishna Reddy)

ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈవీఎంకు సంబంధించి ఒక కేసు నమోదయింది. దీనిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు ఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరట ఇచ్చింది. అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు ఉన్నందున కేసులోకి వెళ్లట్లేదని, పిన్నెల్లిని జూన్ 5 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది. కౌంటింగ్‌ తేదీ కంటే ముందే పిన్నెల్లిని అరెస్ట్‌ చేస్తారని ఎన్నో కధనాలు వచ్చాయి .

పిన్నెల్లి పై ఒకదాని వెంట ఒకటి వరుసగా కేసులు నమోదు అయ్యాయి .దింతో పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇరుపక్షాల వాదనల విన్న న్యాయమూర్తి ముందస్తు బెయిల్ మంజూరు చేసారు . ఈ సందర్భంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి పోలీస్ లు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పిన్నెల్లి లాయర్ హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ విషయంలో మొత్తం రికార్డులు తెప్పించమని హైకోర్టు ఆదేశించింది. దింతో కోర్టు ముందు రికార్డులు సమర్పించగా వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.