Site icon Prime9

Konda Surekha: టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా

Konda Surekha

Konda Surekha

Konda Surekha: టీపీసీసీ ఎ‍గ్జిక్యూటివ్‌ కమిటీకి మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు కొండా సురేఖ రాజీనామా చేశారు. టీపీసీసీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొండా సురేఖ రాజీనామా చేశారు. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో తనపేరు లేదని, అలాగే వరంగల్‌కు చెందిన ఏ ఒక్క లీడర్‌ పేరు కూడా లేకపోవడం మనస్థాపాన్ని కలిగించిందన్నారు. తనకంటే జూనియర్లకు పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీలో స్థానం కల్పించారని.. ఇది తనను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో తనను వేయడం బాధించిందని.. ఇందులో రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోపాటు కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని వారిని నామినేట్‌ చేసిన కమిటీలో నన్ను వేయడం అవమానపర్చినట్లుగా భావిస్తున్నానని ఆమె అన్నారు. మాకు పదవులు ముఖ్యం కాదని.. ఆత్మాభిమానం ముఖ్యమని.. నమ్ముకున్న వారి కోసం ఒకానొక సమయంలో మంత్రి పదవినే వద్దు అనుకున్నదాన్ని అంటూ ఘాటుగా స్పందించారు. 35 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు.

ఏ రోజు కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించలేదని.. ఎప్పుడూ పార్టీ అభివృద్ధి కోసమే సొంత ఖర్చులతో పనిచేశామన్నారు. నమ్మిన పార్టీ కోసం ఏ చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామాన్నారు. కాబట్టి నేను ఈ కమిటీలో కంటిన్యూ కాలేనని. అందుకే తెలంగాణ ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌గా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ ఈస్ట్‌, పరకాల నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృష్టిచేస్తూ ఒక సామాన్య కార్యకర్తలా కాంగ్రెస్‌లో కొనసాగుతా అని కొండా సురేఖ వెల్లడించారు.

Exit mobile version