Kodi Katti Case: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మీద గతంలో జరిగిన దాడి గురించి అందరికీ తెలిసిందే. సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. కోడి కత్తి కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. అలానే ఈ కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేసింది.
చార్జిషీట్ ఎక్కడ..
నిందితుడి తరఫున న్యాయవాది సలీమ్ వాదిస్తూ.. కేసులో బాధితుడిగా ఉన్న వ్యక్తిని ( సీఎం జగన్ ) ఇంతవరకు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు.
అందుకు ఎన్ఐఏ న్యాయవాది బదులిస్తూ.. స్టేట్ మెంట్ రికార్డు చేశామని కోర్టుకు తెలిపారు. దాంతో, స్టేట్ మెంట్ రికార్డు చేస్తే చార్జిషీట్ లో ఎందుకు పేర్కొనలేదని కోర్టు ప్రశ్నించింది. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందని కోర్టు(Kodi Katti Case) అభిప్రాయపడింది. ఈ మేరకు నెల 31 నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఐలవ్ రాజకీయాలు రోజురోజుకీ హీట్ ఎక్కుతున్న తరుణంలో ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు అయిన తెదేపా, జనసేన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలిలో యువశక్తి సభా వేదికగా సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మూడు ముక్కల సీఎం అంటూ పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ను వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/