Kodali Nani: ఏపీ ప్రభుత్వంపై వాల్తేరు వీరయ్యసినిమా 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపట్ల గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వైసీపీ కొడాలి నాని ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకి కూడా చెబితే బాగుంటుందని చిరంజీవికి సూచించారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లున్నారని తెలిపారు. రాజకీయాలు మనకెందుకు.. డ్యాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి ఆలోచించండని తన పకోడిగాళ్లకు సలహాలు ఇస్తే బాగుంటుందని కొడాలి నాని సూచించారు.
17 ఏళ్లు రాజకీయం చేసి ఏం చేసాడు? ..(Kodali Nani)
చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడు. కాంగ్రెస్ లో ఐదేళ్లు మంత్రిగా పనిచేసాడు. మొత్తంమీద 17 ఏళ్లు రాజకీయం చేసాడు. ఆరోజు పోలవరం, పులివెందుల,తెలుగుగంగ ఎందుకు పూర్తి చేయలేదు? గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎందుకు పూర్తి చేయలేదు? ఇపుడు వచ్చి అధికారాన్ని ఇవ్వండి అంటే ప్రజలు నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు నీవల్లే పెండింగ్ లో ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి జలయజ్జం ప్రారంభించి కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఏం చేసారు? పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి నాలుగుచోట్ల ఓడిపోయే కెపాసిటీ వున్న వ్యక్తి. చంద్రబాబును సీఎం చేయడం అతని జేబులో లేదని కొడాలి నాని అన్నారు.