Junior NTR: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లను అభినందిస్తూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్‌ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు.
చారిత్రాత్మక విజయం..( Junior NTR)
చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్, పురందేశ్వరి అత్తకు శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన పవన్ కల్యాణ్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.
మరోవైపు నందమూరి కల్యాణ్ రామ్ కూడా చంద్రబాబు విజయంపై స్పందించారు. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకీ, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ కృషి పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. అలాగే బాబాయ్ బాలయ్య, అత్తయ్య పురందేశ్వరీ, లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.