Pawan Kalyan satires: ఆంధ్రప్రదేశ్‌లో బంగారు గనులు బయపడ్డాయని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు. ఏపీలో 47 పాయింట్ ఒకటి ఏడు టన్నుల బంగారు నిక్షేపాలున్నాయని ప్రహ్లాద్ జోషి చెప్పిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూ సెటైర్లు వేసారు.
కెజిఎఫ్ గెట్ రెడీ..(Pawan Kalyan satires)
వైఎస్ఆర్‌సిపి అడ్వంచరస్ ప్రెజెంట్స్ జగనన్నాస్ గోల్డ్ అంటూ ట్వీట్ చేశారు. నౌ ఓన్లీ టాస్క్ సెర్చింగ్ ఫర్ గోల్డ్ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.కెజిఎఫ్ గెట్ రెడీ.. హియర్ కమ్స్ జెజిఎఫ్ అంటూ పవన్ ట్వీట్ చేసారు.ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో జిఎస్ఐ నిర్వహించిన బంగారంపై పరిశోధనల ప్రకారం రామగిరి బంగారు క్షేత్రం, పెనకచెర్ల బంగారు క్షేత్రం, జోనగిరి పలకల బెల్టు, చిగురుగుంట దక్షిణానికి ఉన్న బినత్తం బంగారు బెల్ట్‌లలో బంగారు నిక్షేపాలు కనిపించినట్టు తెలుస్తోంది.
ఎంఎండిఆర్ చట్టం, 2015 అమలు తర్వాత, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చిగురుగుంట, బిసనత్తం బంగారు గనులు గురించిన భౌగోళిక రాజకీయ నివేదికలు వచ్చిన తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ ఈ విషయాన్ని తెలిపారు.