Janasena chief Pawan Kalyan :ఆంధ్రప్రదేశ్ కు పట్టిన వైసీపీ తెగులుకు జనసేన- టీడీపీ వ్యాక్సినే సరైనదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం రాజమండ్రిలో జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అస్దిరతకు గురైన ఏపీలో సుస్దిరత తేవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అక్రమకేసులు బనాయిస్తున్నారు..(Janasena chief Pawan Kalyan)
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రత్యర్దులను అక్రమకేసులతో జైళ్లకు పంపించి భయబ్రాంతులకు గురిచేస్తోందని పవన్ అన్నారు. అచ్చెన్నాయుడు మొదలుకుని చంద్రబాబు నాయుడు వరకు ఇదే విధానాన్ని వైసీపీ పాటిస్తోందని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన చంద్రబాబును అక్రమకేసులతో జైలుకు పంపి బెయిల్ రానీయకుండా చేయడం బాధాకరమన్నారు. గుంటూరు జిల్లాలో 14 ఏళ్ల కుర్రాడిని చంపిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చిందని కాని చంద్రబాబుకు మాత్రం బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మానసికంగా మద్దతు ఇవ్వడం, టీడీపీ కేడర్ కు మనోబలం ఇచ్చేలా ఈ సమావేశాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసామని తెలిపారు. జనసేన- టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాజమండ్రిలోనే ఇలాంటి సభ జరగాలని పవన్ అన్నారు. తాము వైసీపీకి వ్యతిరేకం కాదని వైసీపీ విధానాలకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ఎట్టిపరిస్దితుల్లోనూ వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని అన్నారు. తమ రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణపై పది రోజుల్లోస్పష్టత వస్తుందన్నారు. నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణపై ప్రకటన ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీఎం పదవిపై చర్చించలేదని ఏపీ సుస్థిరత- భద్రతపైనే చర్చించామన్నారు. ఏపీలో చిత్రమైన రాజకీయ పరిస్దితి ఉందని ఈ విషయాన్ని బీజేపీ కూడా అర్దం చేసుకుందని పవన్ పేర్కొన్నారు.
నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంకోసమే టీడీపీ – జనసేన పొత్తు ఏర్పడిందని అన్నారు. అక్టోబర్ 29,30,31 తేదీల్లో టిడిపి- జనసేన జిల్లాలవారీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తరువాత ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసి ముందుకెడతామని తెలిపారు. 2024లో టిడిపి- జనసేన కూటమి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని లోకేష్ పేర్కొన్నారు. ఈ రోజు భేటీలో మూడు తీర్మనాలు చేసామని తెలిపారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఒకటి, పొత్తు విషయమై మరొకటి, అన్ని వర్గాలను తమ పొత్తు అభివృద్ది బాటలో నడిపిస్తుందంటూ మరో తీర్మానం చేసామని లోకేష్ వివరించారు.