Site icon Prime9

Pawan Kalyan: ఏపీ రోడ్ల పరిస్ధితులపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్

Andhra Pradesh: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మరో వినూత్న డిజిటల్ క్యాంపెయిన్ కు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో గ్రామీణ రహదారుల దుస్థితిపై ఒక నిమిషం వీడియో లేక నాలుగు ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలంటూ జనసేనాని పిలుపునిచ్చారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ హష్ టాగ్ తో ఉదయం నుండి సోషల్ మీడియాలో జనసైనికుల పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రోడ్ల పరిస్థితికి అడ్డం పడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఏపీలో నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్య ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రోజుకో ట్వీట్‌తో రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో తెలియజేస్తున్నారు. తాజాగా రోడ్ల అధ్వాన్న స్థితిపై ఛిద్రమైన రహదారి అంటూ ఓ వీడియోతో పాటు… ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని ట్వీట్ చేశారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను జనసేనాని ట్విటర్‌లో పోస్టు చేశారు. కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి ఈ వీడియోలో తెలుస్తోందంటూ పోస్ట్‌ చేశారు. దానికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు.

Exit mobile version