Janasena chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీకాళహస్తి ఘటనను సీరియస్ గా తీసుకున్న సేనాని.. సీఐ అంజూ యాదవ్ పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. అంతే కాకుండా.. సేనాని ఫొటోకు పాలాభీషేకం చేశారన్న నెపంతో.. జనసేన నాయకులను అరెస్ట్ చేసి సత్యవేడు జైలుకు తరలించారు. దానిపై కూడా సేనాని ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. జనసేన నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి.. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి మెమోరాండం సమర్పించనున్నారు.
ఈ నెల 17న ఢిల్లీ వెళ్లనున్న పవన్ కళ్యాణ్..(Janasena chief Pawan Kalyan)
ఏపీలో బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేనకి ఎన్‌డిఎ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం అందింది. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్‌డిఎ సమావేశం జరగనుంది. ఈ నెల 17 సాయంత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పిఎసి వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీకి వెళుతున్నారు. బిజెపి అగ్రనాయకత్వంనుంచి కొద్ది రోజుల కిందటే పార్టీకి ఆహ్వానం అందిందని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.
నేడు జనసేనలో చేరుతున్న పంచకర్ల..
ఏపీలో జనసేన పార్టీ రోజు రోజుకు బలపడుతోంది. అధికార పార్టీకి సొంత నేతలే షాక్ ఇచ్చి.. జనసేకు క్యూ కడుతున్నారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్.. ఆ పార్టీకి రాజీనామ చేసి జనసేనలో చేరనున్నారు. ఇవాళ సేనాని సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. దాంతో పార్టీలో మరింత జోష్ పెరిగింది. వారాహి యాత్ర వల్ల జనసేనకు పెరుగుతోన్న మద్దతు పెరుగుతోంది. దాంతో మరికొంత మంది వైసీపీ నేతలు జనసేనలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.