Janasena chief Pawan Kalyan: నేను ఎప్పుడూ మిమల్ని ఓటు బ్యాంకుగా చూడలేదు. మీ కష్టాల్లో నేను ఉన్నాను. మీకు అండగా నిలబడతాను అంటూ విశాఖ మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాదంలో బోట్లు కాలిపోయి, నష్టపోయిన మత్స్యకారులకు ఆయన ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ వారిని ఉద్దేశించి ప్రసంగింమచారు.
ఇంక నాలుగు నెలలే..(Janasena chief Pawan Kalyan)
ఎప్పుడూ సాయం చేసినా కష్టాలు తీరిపోయాయని భావించలేదు. రూ.16 వేల కోట్ల మత్స్య సంపద ప్రభుత్వానికి వెడుతోంది. 974 కిమీ సముద్ర తీరం ఉంది… దాదాపు 700 బోట్లు పట్టే హార్బర్ లో సరైన వసతులు ఉన్నాయా అనేద ఆలోచించాలి. ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి. ఇక్కడ చాలా చీకటి గ్యాంగులు ఎక్కువ అయ్యాయని తెలిసింది. వీరు మత్స్యకారులను బెదిరించి మహిళలపై దౌర్జన్యానికి దిగుతున్నారు. వైసీపీ వల్ల రౌడీమూకలు రాజ్యాలేలుతున్నారు. ఇంక నాలుగు నెలలే బరిద్దాం. నాలుగు నెలల తరువాత ఇక్కడ భద్రతతో కూడిన హార్బరును తీసుకు వచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఎంత కండబలం,గుండె బలం ఉండాలో మత్స్యకారులను చూసి నేర్చుకోవచ్చు. కాకినాడలో మత్స్యకారులు నీళ్లల్లో దూకి నా వద్దకు వచ్చారు.గెలిస్తే ఘనమైన మెజారిటీతో గెలవాలి. అందుకే టీడీపీతో జత కలిసాం. మన మత్స్యకారులు పొరుగు రాష్ట్రాలకు ఎందుకు వలసపోవాలి? మీకోసం మాట్లాడే నాయకులు, వ్యక్తుల సమూహం కావాలి. అందుకే జనసేనలో మొట్టమొదట మత్స్యకార విభాగం పెట్టాము. మనమే జెట్టీలు నిర్మించుకుందామని పవన్ అన్నారు.
జిఓ 217 పై పోరాడాను..
ఈ రూపాయి పావలా ప్రభుత్వం కబుర్లు మాత్రమే చెబుతోంది. 3,500 కోట్లతో తీరప్రాంతాలను అభివృద్ది చేస్తామన్నారు. అయితే ఇక్కడ లైట్లు కూడా లేవు. ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.400 కోట్లు అవసరమవుతాయి. జగన్ ఋషి కొండలో చేసిన ఖర్చు తో ఒక జెట్టి తయారు చేయవచ్చు. ఈ రోజు కూడా నా పర్యటనను అడ్డుకుందామని చూసారు. జనసేనను చూసి ఎందుకు భయపడుతున్నారు? 15 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పి తీరా వారి చేతిలోకి 5 లక్షలే పెట్టారు. మిగిలిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలి. నేను తప్పు జరగనివ్వను. మనస్పూర్తిగా నన్ను నమ్మండి. మీకు న్యాయం జరిగే వరకూ నేను పనిచేస్తాను. సంపద అందరికీ చెందాలనేది జనసేన పార్టీ లక్ష్యం.జిఓ 217 ప్రభుత్వం తీసుకు వస్తే దాని పై పోరాడాను.నేను మీ వాడిని మీకోసం ఏమైనా చేస్తాను.ఎన్నికలు కోసం రాలేదు..మీకు ఎప్పుడు ఆపద వచ్చినా నేను వస్తాను.మత్సకారు సోదరులు నన్ను నమ్మండి.చాలా మంది సహాయం చేస్తే నేను మీకు ఈ రోజు ఇలా ఇస్తున్నాను.మీకు సహాయం చేయాలనీ నిర్ణయించినప్పుడు చాల మంది ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు.అవే మీకు ఇస్తున్నాను.వైజాగ్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి నిజామాబాదు వాళ్ళు విరాళం అందించారని పవన్ చెప్పారు. ఈ సందర్బంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు ఒక్కొక్కరికి ర.50 వేల చొప్పున ఆర్దికసాయాన్ని పవన్ కళ్యాణ్ అందజేసారు.