Janasena chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజుసమీక్షలు నిర్వహించనున్నారు. కాకినాడ నగరంలో డివిజన్ల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం అవుతున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ను ఓడించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు.
15 డివిజన్లలో సమీక్ష..(Janasena chief Pawan Kalyan)
కాకినాడ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టి డివిజన్లు వారీగా సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటున్నారు. గతంలో సర్పవరం బహిరంగ సభలో ద్వారంపూడిని ఓడిస్తానని పవన్ చెప్పారు. పవన్ ఓడించేందుకు ఎంత దూరమైనా వెళ్తానని ద్వారంపూడి సవాల్ విసిరారు. ద్వారంపూడి టార్గెట్ గా కాకినాడలో క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. ఈ రోజు సుమారు 15 డివిజన్లలో పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నిన్న 15 డివిజన్లలో జనసేన కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు పవన్. ఒక డివిజన్ లో వివిధ వర్గాలకు సంబంధించిన సుమారు 20 మందితో స్వయంగా మాట్లాడుతున్నారు. వార్డులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? సమస్యలు ఏమిటి? ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనే అంశాలు అడిగి తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.