Janasena chief Pawan Kalyan: దీపం పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే హిందువులకు విశిష్టమైన దీపావళి పండుగ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చీకటి నుంచి వెలుగుల వైపు నడిపించేదే దీప జ్యోతి.. అటువంటి ఈ దీపాల పండుగ ప్రజలందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు.
ఆధునిక నరకాసురుల బెడద తొలగాలి..(Janasena chief Pawan Kalyan)
దుష్ట శిక్షణ… శిష్ట రక్షణ సారమే హిందూ పండుగల పరమార్థం.. దుర్మార్గుడైన నరకాసురుని అంతంతో కలిగిన సంతోషానికి ప్రతీకగా మనం దీపావళిని జరుపుకొంటున్నామని చెప్పారు. ప్రజలను పట్టి పీడించే ఆధునిక నరకాసురులు ఎందరో యధేచ్చగా సంచరిస్తూ ప్రజల మాన ధన ప్రాణాలను దోచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. అటువంటి అపర నరకాసురుల బెడద తొలగిపోవాలని, ప్రజలు నిర్భయంగా నిర్భీతితో నడయాడే మంచి రోజులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు