Janasena chief Pawan Kalyan: ప్రశాంతమైన విశాఖ నగరం భూకబ్జాదారుల, రియల్లర్ల, గూండాల చేతిలో చిక్కుకుని అల్లాడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఆయన ప్రసంగించారు. గూండాల కీళ్లు విరిచే ప్రభుత్వాన్ని తీసుకు వస్తానని తాను ప్రజలకు హామీ ఇస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ కు. అతని గూండాలకు భయపడవద్దు. జగన్ నీవేమైనా దిగి వచ్చావా?నీ ఇష్టం వచ్చినట్లు భయపెడతావా? నేను ప్రాణాలకు తెగించి వచ్చాను. ఎవరి బలిదానంతో రాష్ట్రం వచ్చిందో ఆ పొట్టి శ్రీరాములును మర్చిపోయాము. కాని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు మాత్రం అన్ని చోట్లా కనిపిస్తాయి. వైసీపీని ఆంధ్రప్రాంతం నుంచి తన్ని తరిమేసే వరకూ జనసేన నిరంతరం పోరాటం చేస్తుంది. మీ భద్రత కోసం… భావితరాల భవిష్యత్తుకోసమని అన్నారు. ద్రోహం చేసేవాడిని, అడ్డగోలుగా దోచుకునేవాడిని గద్దె నెక్కించారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. కాని ఏం జరిగింది? రిషికొండను తవ్వేసారు. ఎర్రమట్టిదిబ్బల నుంచి ఇసుకను ఎత్తేసారు. ఓడిపోయిన నన్ను విశాఖ ప్రజలు నన్ను అక్కున చేర్చుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి మాట్లాడటానికి వస్తే ఎంతగానో ఆదరించారని పవన్ కళ్యాణ్ అన్నారు.
సీఎం జగన్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా అన్నా, అక్కా అని పిలుస్తాడు. దానికి అధికారులు పొంగిపోతారు. వారిచేత తనకు కావలసిన విధంగా పనులు చేయించుకుంటాడు. ఇలా చేసిన వారంతా సీబీఐ కేసులు ఎదర్కొంటున్నారు. వాలంటీర్లు అంతా నాకు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల లాంటి వారు. వారికి ఐదువేలు ఇస్తే మరోమ ఐదువేలు ఇవ్వాలని కోరుకుంటాను. కాని జగన్ వారిచేత చేయకూడని పనులు చేయిస్తున్నాడు. ప్రజల డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. పెందుర్తితో ఒక వాలంటీర్ 70 ఏళ్ల వృద్దురాలిని గొంతుకోసి చంపేసాడు. విశాఖలో ఒక ఎంపీని గూండా బెదిరిస్తే దిక్కులేకుండా పోయింది. పంచాయతీకు రావలసిన వెయ్యికోట్ల రూపాయల నిధులను జగన్ వాలంటీర్లుకు జీతాలుగా చెల్లించాడు.అందుకే పంచాయితీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బుల్లేవు. కేంద్రం నుంచి నిధులు నేరుగా మీ ఖాతాల్లో పడేవిధంగా నేను ప్రధానితో మాట్లాడతాను. గ్రామ సభలను బలోపేతం చేస్తాము. నేను 30 వేలమంది మహిళలు కనపడటం లేదని ఎలా చెప్పానని చిత్తూరు ఎస్పీ ప్రశ్నించారు. నాకు కేంద్రం నుంచి వచ్చిన విషయాన్నే చెప్పాను. నేను చెప్పిన దానికన్నా ఎక్కువమందే కనపడటం లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి పార్లమెంట్లో చెప్పారని పవన్ కళ్యాణ్ వివరించారు.
ఆంధ్రాయూనివర్శిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేసారని పవన్ ఆరోపించారు. గంజాయి అమ్మకాలు ప్రారంభించారు. వీసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటేయమని చెప్పారు. ఈ వీసీమీద కేంద్ర మానవ వనరుల శాఖకు ఫిర్యాదు చేస్తాము. జగన్ నువ్వు ఆంధ్రాయూనివర్శిటీని బ్రష్టు పట్టించావు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రాయూనివర్శిటీని ప్రక్షాళన చేస్తాము. జగన్ చేసే అరాచకాలకు సంబంధించి ప్రతీ ఫైల్ కేంద్రం వద్ద ఉంది. విశాఖ సంఘవిద్రోహ శక్తుల అడ్డాగా మారింది. 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్ మెంట్ కు డబ్బులు ఉండవు. కాని బైజూస్ కు 500 కోట్లు ఇచ్చారు. విశాఖలో 120 ఎకరాలు 25వేల కోట్లుకు తనఖా పెట్టారు. ఉత్పాదకత , అభివృద్ది లేకుండా అప్పలు చేస్తే ఎలా? జగన్ ఒక కమీషన్ ఏజంట్. ఒక వ్యాపారి. ఎవరైనా పారిశ్రామిక వేత్త వస్తే నాకు ఎంత కమీషన్ అని అడుగుతాడు. జగన్ కు డబ్బు పిచ్చి పట్టుకుంది. నీకు ఎన్నివేల కోట్లు కావాలి? డబ్బును ముద్దలుగా చేసి తింటావా? డబ్బు ఒక్కడి దగ్గర పేరుకుపోతే మనం ఎలా బతకాలో వాడు చెబుతాడు. మద్యపాన నిషేధం అని వచ్చినవాడు 60రూపాయల లిక్కర్ ను 160 రూపాయలు చేసాడు. మద్యం మీద 30 వేల కోట్లు ఆదాయం సంపాదించాడు.
జగన్ ఒక డెకాయిట్.. ఒక దొంగ.. జనసేన అధికారంలోకి వస్తే ఒక్క కులానికి పెద్ద పీట వేయదు. అన్ని కులాలకు సమానంగా ప్రాతినిధ్యం ఉంటుంది. మరోసారి జగన్ ను అధికారంలోకి తీసుకువస్తే పండుగకు మనం గుమ్మానికి కట్టుకునేది మామిడి తోరణాలు కాదు.. జిల్లేడు తోరణాలు.. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. జగన్ ను పారిపోయేలా చేయండి. జగన్ ను తరిమికొట్టండి.. మీరు భయపడకండి.. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్దితిలోనూ జగన్ మరలా అధిాకారంలోకి రాకూడదు. అరాచకం పోవాలంటే, అభివృద్ది జరగాలంటే జగన్ పోవాలి.. జనసేన అధికారంలోకి రావాలి. మనల్ని ఎవడు ఆపేది.. హలో ఏపీ బైబై వైసీపీ అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.