AP Deputy CM Pawan Kalyan: రాష్ట్ర ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.తాను నిర్వర్తించబోయే శాఖలు.. తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.
మౌలిక వసతుల కల్పనపై దృష్టి..(AP Deputy CM Pawan Kalyan)
ప్రజల సమస్యలను స్వయంగా చూశానన్నారు పవన్. గ్రామాలకు తాగునీరు అందిస్తామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెడతామన్నారు. అటవీ సంపదను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా పంపిణీ, ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. సినీ పరిశ్రమకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. యువతకు ఉపాధి దక్కేలా చూస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్. అదేవిధంగా జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు కేటాయించిన శాఖల పట్ల కూడా పవన్ సంతృప్తి వ్యక్తం చేసారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.