PM Modi in Warangal: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఒక ప్రధాని.. ప్రధాని మోదీ

ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ సారి అధికారంలోకి వస్తే.. ఏడాదికి ఒక ప్రదానిని తీసుకువస్తారని అన్నారు. ఐదు సంవత్సారాలలో ఐదు మంది ప్రధానలు మారుతారు . అంటే దేశ ప్రగతిని అధోగతి పాలు చేయబోతున్నారని ప్రధాని విమర్శించారు. వరంగల్​లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

  • Written By:
  • Updated On - May 8, 2024 / 02:08 PM IST

PM Modi in Warangal:ఇండియా కూటమిపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఈ సారి అధికారంలోకి వస్తే.. ఏడాదికి ఒక ప్రదానిని తీసుకువస్తారని అన్నారు. ఐదు సంవత్సారాలలో ఐదు మంది ప్రధానులు మారుతారు. అంటే దేశ ప్రగతిని అధోగతి పాలు చేయబోతున్నారని ప్రధాని విమర్శించారు. వరంగల్​లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

వరంగల్ అండగా నిలిచింది..(PM Modi in Warangal)

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ గతంలో పదేళ్ల క్రితం దేశంలో అనిశ్చితి ఉండేది. నాలుగు రోజులకు ఒక స్కాం, కుంభకోణం బయటపడేదన్నారు. దేశంలో బాంబ్ బ్లాస్ట‌ుల పరంపర కొనసాగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి అనిశ్చితి లేదని చెప్పుకొచ్చారు.తన దృష్టిలో వరంగల్‌కు చాలా ప్రాధాన్యత ఉందని ప్రధాని మోదీ చెప్పారు. గతంలో బీజేపీ రెండు స్థానాలతో ప్రయాణం మొదలు పెట్టిందని ఆ రెండు సీట్లలో హనుమకొండ కూడా ఒకటని ఆయన తెలిపారు. ప్రతి విషయంలోనూ వరంగల్ తమకు అండగా నిలిచిందన్నారు. బీజేపీకి మీ ఆశీర్వాదాన్ని ఎప్పుడూ మరిచిపోమని అన్నారు. మరోసారి బీజేపీని గెలిపించాలని ప్రజలను మోదీ కోరారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలు మాఫీ చేస్తామనిమోసగించిందని మోదీ ఆరోపించారు. తాజాగా ఆగస్టు 15 లోగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెబుతోంది. అమరవీరులకు పింఛన్ల హామీని మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీని నెరవేర్చిందా? అంటూ మోదీ ప్రశ్నించారు. తెలంగాణను బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇనుప సంకెళ్ల నుంచి విముక్తి చేస్తామని తెలిపారు. బీజేపీ అభ్యర్ది ఆరూరి రమేష్ ను మంచి మెజారిటీతో గెలిపించాలని మోదీ ప్రజలను కోరారు.