mega888 AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో అక్కడడక్కడ

AP Assembly Elections 2024: ఏపీలో పోలింగ్ పెరిగితే ఎవరికి మోదం ? ఎవరికి ఖేదం ?

ఆంధ్రప్రదేశ్ లో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. చూడని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

  • Written By:
  • Updated On - May 13, 2024 / 07:30 PM IST

AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రస్తుతానికి ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా.. చూడని విధంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. దీనితో ఎవరికి వాళ్లు పెరుగుతున్న ఓటింగ్ శాతం తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఉదయాన్నే రావడం కూడా రాజకీయ పార్టీల వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు . సోమవారం సాయంత్రానికి 70 శాతం పోలింగ్ నమోదయింది. ఇది ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

వృద్దులు, మహిళలు ఎక్కువగా వచ్చారని..(AP Assembly Elections 2024)

తమకు ఖచ్చితంగా ఓటు వేసే ఓటర్లను ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అన్ని పార్టీల శ్రేణులు . మరో వైపు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో లేకపోయినప్పటికీ తమ పరిధిలోని యాభై ఇళ్లకు సంబంధించిన ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు . ఉదయాన్నే వచ్చి ఓటు వేసి వెళ్లాలని వాలంటీర్లు సూచించడం, వారు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఏర్పాటు చేయడం వల్లనే ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారని ఫ్యాన్ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, మహిళలు, యువకులు వచ్చి ఓటు వేయడం తమకు అనుకూలమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకో వైపు విపక్షాలు కూడా పోలింగ్ కేంద్రాలకు ఈ విధంగా పెద్దయెత్తున ఓటర్లు తరలి రావడం తమకు లాభమేనంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో గత ఐదేళ్లుగా అభివృద్ధి లేకపోవడంతో ఆగ్రహించి ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఓటు వేస్తున్నారని విపక్షాల వాదన.

యువత, ప్రభుత్వ వ్యతిరేకత..

యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, అందుకే ఈసారి ఓటు వేసేందుకు ఉత్సాహంతో ముందుకు వచ్చారంటున్నారు. మహిళలు కూడా ఫ్రీ బస్సు, మూడు గ్యాస్ సిలిండర్ల హామీతో క్యూ కట్టారని కూటమి నేతలు చెబుతున్నారు . పింఛను కూడా నాలుగు వేల రూపాయలకు పెంచడం వల్ల వృద్ధులు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటున్నారు యువత ఎక్కువగా ఓటు వేయడం తమకు లాభమంటున్నాయి కూటమి పార్టీలు. అదే సమయంలో సంక్షేమ పథకాలు తమ కుటుంబంలో అందుతుండటంతో ఈసారి కూడా పెద్దలు ఇబ్బంది పడకూడదన్న కారణంగానే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారని వైసీపీ వాదన .ఇలా ఎవరి వాదనలు వారు వినిపించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ చూసినా వృద్ధులు, మహిళలే కనిపిస్తుండటంతో రెండు పార్టీలూ తమకు అనుకూలంగానే పోలింగ్ ఉంటుందని చెప్పుకుంటున్నాయి. మొత్తం మీద జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఎవరిది విజయం అన్నది తెలియనుంది. అంతే తప్ప ఎవరి మనసులో ఏముందో? ఎవరు చెప్పగలరు? గుర్రం ఎగరా వచ్చు….