Site icon Prime9

Rahul Gandhi Comments: మోదీ మరలా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతారు.. రాహుల్ గాంధీ

RAHUL

RAHUL

Rahul Gandhi Comments: మోదీ మరలా అధికారంలోకి వస్తే వస్తే రాజ్యాంగాన్ని మార్చే అవకాశముందని అంటూ రాహుల్ గాంధీ అన్నారు .. .ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండియా కూటమి వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పారు.

బడా వ్యాపారవేత్తల కోసమే..(Rahul Gandhi Comments)

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు నరేంద్ర మోదీ అని చెప్పారు . కేవలం 2 శాతం వున్న బడా వ్యాపార వేత్తలకు మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని రాహుల్ అన్నారు .దేశంలో ఎక్కువ శాతం బడుగు ,బలహీన వర్గాల ప్రజలే వున్నారని పేర్కొన్నారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కుల జన గణన జరిపిస్తామని అప్పుడే నిజమైన బడుగు ,బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ ఆ న్నారు ..దళితులు ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు .30 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి వున్న నరేంద్ర మోదీ ఇవ్వలేదని అన్నారు .ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాబోయే ఆగస్టు 15 లోపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు.

ఆగస్టు 15 లోపు రైతు రుణ మాఫీ..

రైతులు సైతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎన్నో భాదలు అనుభవించారని అన్నారు .ఎంత సొమ్ము నరేంద్ర మోదీ కోటీశ్వరులకు ఇచ్చారో అంతే సొమ్ము మేము పేదలకు అందిస్తామని చెప్పారు .అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు .తెలంగాణ లో ఇప్పటికే రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ రూ. ౫౦౦ లభిస్తుంది ,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది .ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మా టీం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని రాహుల్ అన్నారు .ఆగస్టు 15 లోపు రైతు రుణ మాఫీ జరుగుతుందని రాహుల్ హామీ ఇచ్చారు .

 

Exit mobile version