Site icon Prime9

Amit Shah: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం.. అమిత్ షా

Amit Shah

Amit Shah

Amit Shah: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ముస్లిం రిజ్వేషన్లను రద్దు చేస్తామని కేంద్రహోంమంత్రి అమిత్‌ షా గురువారం నాడు తెలంగాణలోని సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడుతూ హామీ ఇచ్చారు. దీనికి బదులుగా ఎస్‌సీ, ఎస్‌టిలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల వారికి లబ్ధి చేకూరుస్తామన్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు తోడుదొంగలు..(Amit Shah)

ముస్లింల ఓట్లు దండుకోవడానికి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో పాటు టీఆర్‌ఎస్‌ ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి గత నెలలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ర్టంలోని ముస్లింలకు విద్యతో పాటు ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్‌ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై అమిత్‌ షా మండిపడ్డారు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని ధ్వజమెత్తారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని సమస్యను క్రమంగా పరిష్కరిస్తూ వస్తోందన్నారు. మోదీ అధికారంలో ఉన్నప్పుడే అమోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరిగిందన్నారు. అలాగే జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిందని గుర్తు చేశారు. అయితే ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్కాంలపై విచారణ జరిపించడానికి ముఖం చాటేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ర్ట సమితి పేరును కాస్తా భారత రాష్ర్ట సమితిగా మార్చారని షా గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ చేసిన స్కాంలపై కాంగ్రెస్‌ దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండు తోడు దొంగలే అని అన్నారు.

తెలంగాణలో అవినీతిని రూపుమాపడానికి మోదీ కంకణం కట్టుకున్నారన్నారు అమిత్‌ షా. ఇటు కాంగ్రెస్‌ కానీ… అటు టీఆర్‌ఎస్‌ కానీ తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని జరుపుకోవడం సాహసం చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం వీరంతా మజ్లీస్‌ పార్టీని చూసి భయపడుతున్నారన్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వం వస్తే సెప్టెంబర్‌ 17న తెలంగాణ విముక్తి దినాన్ని జరుపుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజలు వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్దంగా ఉన్నారన్నారు షా. కాగా తెలంగాణలో 17 లోకసభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్‌ జరుగనుంది. చివరగా 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో భారత రాష్ర్ట సమితి తొమ్మిది సీట్లు గెలుచుకుంటే.. భారతీయ జనతాపార్టీ నాలుగు, కాంగ్రెస్‌ మూడు సీట్లు, ఏఐఎంఐఎం ఒక్క సీట్లు మాత్రం గెలుచుకుంది.

Exit mobile version