Pawan Kalyan: గాజవాక నా నియోజక వర్గం.. దీన్ని నేను వదిలి పెట్టను.. నేను ఓడిపోయాను కాని నా ఆశయం ఓడిపోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో బాగంగా ఆదివారం రాత్రి గాజువాక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ లాంటి వ్యక్తి గెలిచి నేను ఓడిపోవడం చూసాక కాలం ఎందుకు ఈ వ్యక్తికి ఇలాంటి శక్తి ఇచ్చిందని ఆలోచించాను. అయితే మూడు నెలలు తిరగకుండానే భవన నిర్మాణ కార్మికుల సమస్యలకు సంబంధించి సభకు వచ్చాను. 2024 ఎన్నికల్లో జనసేన జెండా గాజువాకలో ఎగురుతుందని పవన్ స్పష్టం చేసారు. దారిపొడుగునా ఒకటే నినాదం… విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీకి చాలా కీలకం. పోరాటాల ద్వారా వచ్చింది.30 మందికి పైగా కాల్పుల్లో చనిపోయారు. మనం కులాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయాము. రెండు తరాలు దాటినా మన గుండెల్లో స్టీల్ ప్లాంట్ కొట్టుకుంటూ ఉంటుంది. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు, అగనంపూడి టోల్ ప్లాజా, పోర్టు కాలుష్యం…ఇవన్నీ ఎప్పుడూ గుర్తుంటాయి. స్టీల్ ప్లాంట్ కు 26 వేల ఎకరాలు కేటాయించారు. భూములిచ్చిన వారిలో ఇంకా సగం మందికి పరిహారం రాలేదు. వారు ఆకలితో దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ గడుపుతున్ప పరిస్దితి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి జగన్ ఒక్కమాట మాట్టాడలేదు. వైజాగ్ ఎంపీ సత్యనారాయణ ఒక రౌడీషీటర్. ఇటువంటి వాడికి ప్రధాని వద్దకు వెళ్లి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే దైర్యం ఉంది. ప్రధాని మోదీ, అమిత్ షాలతో ప్రత్యేక హోదా గురించి విబేధించాను. అమిత్ షా తో స్టీల్ ప్లాంట్ బావోద్వేగాలకు సంబంధించినదని చెప్పాను. ఎనిమిదివేల కోట్ల నష్టం ఉంది. కాని మీరు సొంత గనులు కేటాయించాలి.. దీని మీద దృష్టి సారించాలని కోరాను. ఎంపీలు లేని నేను ఎంత మాట్లాడినా కొంతమేరకే ప్రయోజనం ఉండదని పవన్ అన్నారు.
కేసులున్నోడికి దైర్యం ఎలా వస్తుంది ..? (Pawan Kalyan)
కేసులున్నోడికి, మర్దర్లు చేసినోడికి, లూటీలు చేసినోడికి ప్రధానితో మాట్లాడే దైర్యం ఎలా వస్తుంది? జగన్ వెళ్లి కాళ్లమీద పడితే పదివేల కోట్లు ఇస్తున్నారు. అదే విధంగా ఎంపీలందరూ వెళ్లి మాట్లాడితే ఎందుకు చేయరు? ఏపీ ఎంపీలంటే చాలా చులకన భావం ఉంది. డీసీఐ ప్రైవేటీకరణ గురించి నేను మాట్లాడితే ఆపామని కేంద్ర నాయకులు చెప్పారు. ఒక రౌడీని ఎంపీగా ఎన్నుకున్నారు. వైఎస్ విగ్రహాలను చూసినపుడు గంగవరం మత్స్యకారుని చంపినదే నాకు గుర్తుకు వస్తోంది. గంగవరంలో ప్రభుత్వ పెట్టుబడిని జగన్ అమ్మేసాడు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేవు.. జాబ్ క్యాలెండర్లు లేవు. మత్స్యకారుల బలిదానాల మీద నీవు పోర్టు కట్టావు. గంగవరం పోర్టుకు న్యాయం చేయలేనివాడివి విశాఖను రాజధాని చేసి ఏం చేస్తావు? గంగవరం పోర్టు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకపోతే ఎలా? నేను చాలా మొండివాడిని.. నన్నేమీ భయపెట్టలేరు. పోలవరం పూర్తి చేయలేరు.. సుజల స్రవంతిని తీసుకు రారు. ఏపీకి చెందిన లక్ష కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తెలంగాణలో ఉండిపోయాయి. జగన్ పట్టించుకోవడం లేదు. దసపల్లాలో రెండువేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్ జరుగుతోంది. కానిస్టేబుల్ ఉద్యోగాలు రాక 700 మందికి పైగా హోం గార్డులు అగమ్యగోచరంలో ఉన్నారు. పోలీసులకు టీఏలు, డీఏలు లేవు. వారు కూడా విసిగిపోయారు. రెండున్నర లక్షలమంది వాలంటీర్లకు హెడ్ ఎవరు? ఈ డేటా ఎక్కడికి వెడుతోంది? వీటికి జవాబు చెప్పరు. మీరు గనుక నాకు మూడు సంవత్సరాలు టైమ్ ఇస్తే అండగా నిలిస్తే ఇక్కడ ఐటీని అద్బుతంగా డెవలప్ చేస్తాను.. కొండమీద దేవుడు ఉండాలి.. క్రిమినల్ ఉండకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు.
వైజాగ్ ఎంపీ మీద మరలా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం..
మూడు వేలమంది కౌలు రైతులు చనిపోతే వారి డేటా జనసేన బయటకు తీసింది. నా పొంత నిధులు, పార్టీ సానుభూతి పరుల నిధులతో వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాము. నగరపాలక సంస్దలు సరిగా పనిచేస్తే రుషికొండను సీఎం కూడా ఏం చేయలేడు. సర్పంచులకు కేంద్ర నిధులు డైరక్టుగా వారి ఖాతాల్లో పడేవిధంగా చర్యలు తీసుకుంటాము. ఆంధ్రాయూనివర్శిటీ వీసీ పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాడు. రిటైరయిన వారిని తీసుకువచ్చి వారితో పాఠాలు చెప్పించి వారికి జీతాలు ఇవ్వడం లేదు. ఈ వీసీ వైసీపీ మద్దతుదారుడు. వైజాగ్ ఎంపీ నాలుగు ఫ్లోర్లకు అనుమతి తీసుకుని వైజాగ్ ఎంపీ ఇరవై ఫ్లోర్లు నిర్మిస్తున్నాడు.జనసేన అధికారంలోకి వస్తే వాటిని కూల్చేస్తాము. నీ మీద రౌడీ షీట్ మరలా ఓపెన్ చేయడం ఖాయం. ఒక రౌడీ ఎంపీ ఇంట్లోకి వెళ్లి భార్యను, కుమారడిని, ఆడిటర్ ను బంధిస్తే రెండు రోజులు ఎవరికీ తెలియలేదు. విశాఖలో ఆస్తులు దోచేయడానికి ఇక్కడ ఉన్నావా? గాజువాక నుంచి చెబుతున్నా జగన్ నువ్వు దిగిపో.. పులివెందుల వెళ్లిపో. బెంగళూరు వెళ్లిపో అని హెచ్చరించారు. జగన్ ను దేవుడని మొక్కితే దెయ్యమై పీడిస్తున్నాడు. జగన్ అనే వాడు మరలా రాకూడదు. అరాచకాలు ఆగాలన్నా, అభివృద్ది జరగాలన్నా జగన్ దిగిపోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.