Site icon Prime9

కేటీఆర్ : డ్రగ్స్ టెస్ట్ కోసం రక్తం, కిడ్నీ, బొచ్చు కూడా ఇస్తాను.. మంత్రి కేటీఆర్

KTR

KTR

KTR : డ్రగ్స్ టెస్ట్ కోసం తన రక్తం, కిడ్నీ, బొచ్చు కూడా ఇస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి స్పందించారు. తాను ఇక్కడే వుంటానని, డాక్టర్లను తీసుకురావాలని కేటీఆర్ పేర్కొన్నారు. క్లీన్‌చిట్‌తో బయటకు వస్తానని… మరి కరీంనగర్‌లో బండి సంజయ్ తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా అని సవాల్ చేసారు. బండి సంజయ్ మనిషా, పశువా అని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

డ్రగ్స్ టెస్టుల్లో తాను క్లీన్ చిట్ తో బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు డ్రగ్స్ టెస్టులో క్లీన్ చిట్ వస్తే కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద చెప్పు దెబ్బలు తినేందుకు బండి సంజయ్ సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. బండి సంజయ్ కి తెలివి ఉందా, అసలు మనిషేనా, ప్రజలకు ఏం చేశారో చెప్పమని అడిగితే పనికిమాలిన కూతలు, ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కరీంనగర్ ప్రజలకు ఏం చేయలేదు కనుక అరుపులు, పెడ‌బొబ్బలు పెడుతుండు అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు గుజరాత్ వ్యక్తులకు దేశం మొత్తం సలామ్ కొట్టాలంట. వారికి గులాంగిరి చేసే బండి సంజయ్ లాంటి నేతలను తెలంగాణ ప్రజలకు నమ్మే అవకాశమే లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎదిగిన తీరు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కానీ బండి సంజయ్ లాంటి నేతలు ఇంకా ఆ ఇద్దరు నేతలకు చెప్పులు తొడుగుతూ కాలం వెల్లదీస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

కొద్దిరోజుల క్రితం తనకు పొగాకు నమిలే అలవాటు వుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటరిచ్చారు. కేటీఆర్‌కు డ్రగ్స్ సేవించే అలవాటు వుందని, దమ్ముంటే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఈ ట్విట్టర్ టిల్లు తాను పొగాకు నములుతానని అంటున్నాడని.. ఇది అబద్ధమన్నారు. కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అని సంజయ్ ఆరోపించారు. తాను తన శరీరంలో రక్తం సహా ఏ శాంపిల్‌ అయినా టెస్టుల కోసం ఇవ్వడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. మరి తనలాగే కేటీఆర్ కూడా పరీక్షలకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

Exit mobile version