MP Komati Reddy Venkata Reddy: నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చించారు. ఖమ్మం, నల్గొండ సభలకు ప్రియాంకను కోమటిరెడ్డి ఆహ్వానించారు. అనంతరం సోనియాగాంధీని కలిసి తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వీలుంటే ఖమ్మం సభకు వస్తానని చెప్పారని అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పాలనతో 4 కోట్లమంది ఇబ్బంది పడుతున్నారని సోనియాకి చెప్పాను. సూర్యాపేట, ఖమ్మం సభకి రావాలని కోరాను. తెలంగాణ పరిస్థితులని వివరించాను.
ప్రత్యేక దృష్టి పెడతామని సోనియా అన్నారు. ప్రతి 10 రోజులకి ఒకసారి రావాలని ప్రియాంకని కోరాను. మేమంతా కలిసిపోయాం విబేధాలు లేవన్నామని చెప్పాను. ఒకరికొకరం సహకరించుకుంటున్నామని చెప్పాను. కర్ణాటక తరహాలోనే ముందుగానే టిక్కెట్లను ప్రకటించాలని ప్రియాంక, సోనియాగాంధీలను కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.