Site icon Prime9

IT Raids: మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లల్లో ఐటీ సోదాలు

IT Raids

IT Raids

IT Raids::హైదరాబాద్‌లోని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు.గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రదీప్‌ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ప్రదీప్ మంత్రికి దగ్గరి బంధువు.  సబితా ఇంద్రారెడ్డి  ఇతర బంధువుల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

15 ప్రాంతాల్లో సోదాలు..(IT Raids)

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీపై అధికారులు ప్రస్తుతం దాడులు నిర్వహిస్తున్నారు, నగరంలో 15 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.ఫార్మా కంపెనీ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లతో పాటు సిబ్బంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారుగా 10 ఐటీ అధికారుల బృందాలు సోదాలు ప్రారంభించాయి.పన్ను ఎగవేత ఫిర్యాదులపై వచ్చిన ఆర్థిక లావాదేవీల రికార్డులను ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.ఆర్‌సి పురంలోని నాగులపల్లి, అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, గచ్చిబౌలిలో సోదాలు జరిగాయి.గచ్చిబౌలి ప్రాంతంలోని మై హోమ్ భూజా, అపార్ట్‌మెంట్లలోని ఫార్మా కంపెనీలకు చెందిన కొందరు ఉన్నతాధికారుల ఫ్లాట్లలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు.

Exit mobile version