Janasena Yuvashakthi: నేను కులనాయకుడిని కాదురా సన్నాసుల్లారా.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు. నేను ఒక కులం కోసం రాలేదు. అన్ని కులాలు బాగుండాలని కోరుకున్నాను. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడాను. ఒక కులాన్ని పెంచడానికి నేను రాలేదు. మనం అనుకుని కులంలో పుట్టలేదు. వైసీపీ వారు అన్నీ ఒక్క కులంతో నింపేసుకుంటున్నారు. అది కరెక్టేనా? నేను ఓడిపోవడానికయినా సిద్దమే అని అన్నారు.
కులనాయకుడిని కాదు
పొద్దున్నే డబ్బులిస్తా.. సాయంత్రం పట్టుకుపోతా అనే సీఎం ఉన్నాడు. నవరత్నాలన్నాడు. మనకు మూడుముక్కల సీఎం ఉన్నాడు. అతనికి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ అంటే పిచ్చట. ఈ మధ్యే తెలిసింది. మంచి వ్యక్తిత్వం ఉన్నవారు విమర్శిస్తే నేను సహిస్తా. జైలుకెళ్లి ఖైదీ నెంబర్ 6093 కూడా నాగురించి మాట్లాడటమా? నేను పోలీసునయితే చచ్చిపోతానబ్బా. డీజీపీగారికి కూడా చెబుతున్నాను మీరు సెల్యూట్ కోట్టేది సీఎంకు కాదు .. ఖైదీ నెంబర్ 6093 కి అంటూ పవన్ సెటైర్లు వేసారు.
నేను బతికున్నంత వరకూ మీతో యుద్దం చేస్తాను.. నేను పారిపోను అంటూ వైసీపీ నేతలకు జనసేనాని వార్నింగ్ ఇచ్చారు.
మీ అందరికీ జీవితాన్ని జుర్రేయాలని ఉంది. మట్టిపాత్రలో అన్నంపెట్టినా తింటా. లేకపోతే పస్తులుంటా.
సినిమాలు పోతే మూసుకు కూర్చుంటాను.. నా మట్టికోసం నేను వచ్చాను. పోలీసుకేసులు, జైళ్లు అంటే భయం లేదు.
సంబరాల రాంబాబు చాలా తెలివిగా, ముదురుముఖం వేసుకుని మాట్లాడతాడు. ఈ పిచ్చికూతలు మానేసి పనులు చూడండి. నన్ను మాట్లాడిన ప్రతీ ఒక్కరిని నేను మరిచిపోను.. నా వాళ్లు మరిచిపోరు అంటూ వపన్ యువశక్తి సభావేదికగా (Janasena Yuvashakthi) హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
కానిస్టేబుల్ కొడుకు పార్టీకి.. సైకిల్ మెకానిక్ కొడుకు మద్దతు
ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై డ్యాన్స్ చేసిన పవన్ కళ్యాణ్
వైసీపీ జెండా మోసేవారికే సంక్షేమ పథకాలు- నాదెండ్ల మనోహర్
వైసీపీ జెండా మోసేవారికే సంక్షేమ పథకాలు- నాదెండ్ల మనోహర్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/