Site icon Prime9

Fake Degree Certificates: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారీ చేసే ముఠాను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

Fake Degree Certificates

Fake Degree Certificates

Fake Degree Certificates: నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారీ చేసి నిరుద్యోగ యువతి, యువకులకు అమ్ముతున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మహేశ్వరం SOT, చైతన్య పురి పోలీసుల దాడుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో మొత్తం 7మంది ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

విశ్వసనీయ సమాచారం మేరకు మహేశ్వరం జోన్ SOT, చైతన్య పురి పోలీసులు దాడులు చేపట్టగా ముఠా గుట్టు రట్టయింది. మెహదీపట్నం కి చెందిన 45ఏళ్ల మొహమ్మద్ అబ్రార్ (45), 28 ఏళ్ల సయ్యద్ ఇనైన్ మొహమ్మద్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాంసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరు మహాత్మా గాంధీ, కాశి విద్యాపీఠ్, వారణాసి, బాబా విద్యాపీఠ్, బీహార్ కు చెందిన సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ యూనివర్సిటీ ల నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు.

వివిధ యూనివర్సిటీల డిగ్రీ పట్టాలు..(Fake Degree Certificates)

సులభంగా డబ్బు సంపాదించాలని వివిధ యూనివర్సిటీల నకిలీ డిగ్రీ పట్టాలు తయారు చేసి అమ్ముతున్నారు. విదేశాలకు వెళ్లే వారికి కూడా నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్నట్లు బయటపడింది. ఒక్కొక్కరి నుండి 30 వేల నుండి 40 వేలు వసూలు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా కన్సల్టెన్సీ ఏజెన్సీలకు విద్యా ధృవీకరణ పత్రాలను అందించినట్లు గుర్తించారు. 2 లేదా 3 వేల కమిషన్ తీసుకుని మహమ్మద్ అబ్రార్ హుస్సేన్ దందా నడుపుతున్నారు. నిందితులకు 41-A CRPS నోటీసులు జారీ చేశారు. నిందితుల పై 420, 468, 471 , 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

Exit mobile version