Site icon Prime9

Kuppam: కుప్పంలో హై టెన్షన్.. పోలీసులకు తేదేపా నేతలకు మధ్య ఘర్షణ

kuppam

kuppam

Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నుంచి శాంతిపురానికి వెళ్లాల్సిన టీడీపీ ప్రచార రథాన్ని, వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

శాంతిపురం మండలం లో వందల మంది పోలీసులు మోహరించారు. టీడీపీ ప్రచార రథాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్లు, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజి ని పోలీసులు తొలగించారు. దీనితో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వెడుతున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసు బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు ఎత్తిపడేసి ఆందోళనకు దిగారు. మరికొద్దిసేపట్లో చంద్రబాబు కుప్పం పర్యటన ప్రారంభంకానుండగా అక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా కనిపిస్తోంది.

Exit mobile version