Dhachepalli: పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని జనసేన కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. నేడు దాచేపల్లిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొనున్నారు. రాంబాబు పర్యటనను అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారం మేరకు పోలీసులు జనసేన కార్యాలయాన్ని ముట్టడించారు. జనసేన నాయకులను ఎక్కడికి వెళ్లకుండా కార్యాలయం చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో దాచేపల్లి(Dhachepalli) కార్యాలయంలో పోలీసులు, జనసేన పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ జనసేన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులు, మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
మరోవైపు వైసీపీ ప్రభుత్వం రాజకీయ పార్టీల రాజ్యంగ హక్కులను కాలరాస్తూ తీసుకువచ్చిన చీకటి జీవో నంబర్ 1 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన, టిడిపి పార్టీలు గుంటూరులో ఆందోళనకు దిగాయి. వివిధ విద్యార్థి సంఘాలతో కలిసి టిడిపి, జనసేన నాయకులు గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను ప్రజలు కూడా అంగీకరించరని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. గతంలోనూ అంబటి పవన్ కళ్యాణ్ పై పలు సందర్భాల్లో అనేక కామెంట్లు వేశారు. దానికి తగినట్టుగానే జనసైనికులు సైతం అంబటిపై విమర్శలు గుప్పించారు.
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/