Harirama Jogaiah: కాపుసంక్షేమ నేత ,సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామ జోగయ్య ప్రధాని మోదీకి లేఖ రాసారు .గత కొంతకాలంగా ఏపీలో ఎన్డీయే కూటమి విజయాన్ని కాంక్షిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు ,కూటమిలోని టీడీపీ కి సలహాలు ,సూచనలు చేస్తూ లేఖలు రాయడం తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీ కి లేఖ రాయడం ఆసక్తిని రేపుతోంది .ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రానుందని ఈ క్రమంలో కాపుల సంక్షేమం కోసం రిజర్వేషన్స్ కల్పించాలని ఆ లేఖలో కోరారు .అదే విధంగా మూడు పార్టీలతో కూటమి కట్టడంలో ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు రాబోయే ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు . ఏపీలో తెలుగుదేశం, జనసేన, బి.జె.పి.తో కూడిన ఎన్.డి.ఏ కూటమి 120 అసెంబ్లీ సీట్లు తక్కువ కాకుండా విజయం సాదించ బోతుందని తెలిపారు .. దీనికి ముఖ్యకారకులు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు జోగయ్య .
ఆర్థికపరంగా వెనుకబడ్డ కాపులు..( Harirama Jogaiah)
కాపులు ఆర్థికపరంగాను విద్యాపరంగాను, ఉద్యోగపరంగాను, సామాజికపరంగాను, రాజకీయపరంగాను బి.సి. కులస్తులతో సమానంగా వెనుకబడి ఉన్నమాట వాస్తవం వున్నారని ఆ లేఖలో జోగయ్య తెలిపారు . కాపు కులస్తులను వాడుకుంటూ అగ్రవర్ణాలలోని కొన్ని కుటుంబాలు రాజకీయంగా లబ్ధిపొందుతున్నాయని పేర్కొన్నారు . కాపుల ఓట్లతో గెలిచి కాపులకు ఏమి చేయడంలేదని ,వాళ్ళు మాత్రం ప్యాలస్ లు కట్టుకుంటున్నారని తెలిపారు . ఈ రకమైన స్థితిలో ఉన్న కాపు కులస్తులను ప్రధానమంత్రిగా, ఎన్.డి.ఎ. అధినేతగా పట్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు . జోగయ్య చేసిన డిమాండ్ లలో మొదటిది కాపులకు బి.సి. హోదా కల్పించటం ద్వారా బి.సి.లతో సమానంగా అన్ని రంగాలలోను కాపులకు సంక్షేమ ఫలాలు అందచేయటం, అప్పటివరకు ఈ.డబ్ల్యు. ఎస్. కోటాలో 5శాతం, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కలుగచేయటం.ఇక రెండవది తెలుగుదేశం, బి.జె.పి., జనసేనపార్టీలను ఎన్.డి.ఎ. కూటమిలో చేర్చటం ద్వారామూడు పార్టీలును ఒకతాటికి తీసుకువచ్చి, జనసైనికుల శక్తిని ఉపయోగించి కూటమి విజయానికి ముఖ్య కారకుడయిన పవన్ కళ్యాణ్ కు రాష్ట్రాధికారంలో ముఖ్యభాగస్వామ్యం కల్పించడం .వీటి పై మోదీ స్పందించి దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జోగయ్య కోరారు .