Ranasthalam: లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ కలిగి ఉన్న నేరానికి ఒక హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. మెళియాపుట్టి మండలానికి చెందిన సవర ప్రసాద్, సవర గజపతి తుపాకీ విడిభాగాలు, తూటాలను బైక్ పై తీసుకెళ్తుండగా టెక్కలి-మెళియాపుట్టి మార్గంలో వాహన తనిఖీలు చేస్తుండగా అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు.
లైసెన్స్ లేని తుపాకీ..
జలుమూరు పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ టెక్కలిలోని ఎన్టీఆర్ నగర్‌లో నివాసముంటున్న కిల్లాని యుగంధర్‌కు చెందినదిగా గుర్తించి అతడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 12 ఎం.ఎం. సైజు గల ఖాళీ, లైవ్ తూటాలు మొత్తం 96 స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా నాటుతుపాకీ కలిగి ఉన్న కారణంగా హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ తెలిపారు.
గత ఏడాది నవంబర్ నెలలో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఆబ్కారి అధికారులు నిజాంసాగర్ మండలం సంగీతంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా గంజాయి మొక్కలతోపాటు రెండు నాటు తుపాకులు లభించాయి. దీంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని ఎక్సైజ్ అధికారులు బాన్సువాడ పోలీసులకు అప్పగించారు. నిందితుడు నాటు తుపాకులను జంతువుల వేటకు వాడుతున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి…
Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
Unstoppable Show: అన్ స్టాపబుల్‌లో సందడి చేయనున్న “వీర సింహారెడ్డి” టీం… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vasantha Krishna prasad: ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
Pathaan Trailer: యాక్షన్.. యాక్షన్.. యాక్షన్.. దుమ్మురేపుతున్న షారూఖ్ ఖాన్ “పఠాన్” ట్రైలర్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/