Site icon Prime9

Assembly Sessions: విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేసిన ప్రభుత్వం

Assembly sessions

Assembly sessions

 Assembly Sessions:  విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సభలో మంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. ప్రస్తుతం అప్పుల పరిస్థితి చూస్తే.ఆందోళన కరంగా ఉందని తెలిపారు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం ఎలా నాశనం చేసిందో ప్రజలకు తెలియాలనే శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నామని ప్రకటించారు.

 రూ. 81వేల కోట్ల అప్పులు ..( Assembly Sessions)

ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో సుమారు 81 వేల కొట్ల అప్పులు మిగిల్చారని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.వ్యవసాయానికి, పరిశ్రమలకు ఎంతో కీలకమైన విద్యుత్ రంగాన్ని.. గత ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. డిస్కంల దగ్గరి నుంచి మొదలు పెడితే.. ట్రాన్స్ కో, జెన్ కో లకు బకాయిలు మిగిల్చారని ఇప్పటి వరకు విద్యుత్ రంగంలో సుమారు 81 వేల కొట్ల అప్పులు మిగిల్చారని అన్నారు. విద్యుత్ రంగం పరిస్థితిప్రజలకు తెలియజేయాలి.గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు.వ్యవసాయానికి, పరిశ్రమలకు విద్యుత్ ఒక వెన్నెముక లాంటిది. రాష్ట్రానికి విద్యుత్ రంగం ఎంతో కీలకం. అయితే రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్దితి ఆందోళనకరంగా ఉంది. డిస్కంలకు గత ప్రభుత్వం భారీ బకాయిలు మిగిల్చింది.2023 అక్టోబర్ నాటికి రూ. 39,457 కోట్లకు అప్పులు చేరాయి.ట్రాన్స్‌కో కు సంబంధించి 2023 నాటికి రూ. 50,136 కోట్లకు అప్పులు చేరాయి .జెన్‌కో అప్పులు 2023 నాటికి రూ. 31923 కోట్లకు చేరాయి.డిస్కంలకు సంబంధించి చెల్లించాల్సిన అప్పులు రూ. 28673 కోట్లు చెల్లించాల్సి ఉందని భట్టి విక్రమార్క చెప్పారు.

Exit mobile version