Janasena Glass Symbol: ఇంతకాలం గ్లాస్ గుర్తు పై వివాదం నెలకొంది .2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయిలో విజయం సాధించలేదు .దింతో గాజు గ్లాస్ గుర్తు జనరల్ కేటగిరీ లో ఉంచింది ఎన్నికల సంఘం . తాజా ఎన్నికల్లో సైతం జనసేన పోటీ చేయని స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ చేసింది .దింతో కొన్ని చోట్ల గాజు గ్లాస్ గుర్తు పై కొందరు పోటీ చేసారు . ఇప్పుడు జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయికి వెళ్ళింది. తాజాగా వెలువడిన ఫలితాలు పార్టీ ఎన్నికల చిహ్నాలకు సంబంధించిన ఇబ్బందులు తొలగనున్నాయి.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8.53 శాతం ఓట్లను జనసేన దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న జనసేన 137 స్థానాల్లో పోటీ చేయగా.. 17,36,811 ఓట్లు వచ్చాయి. ఒక్క నియోజకవర్గంలోనే విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో జనసేనకు 28,76,208 ఓట్లను సొంతం చేసుకుంది. మొత్తం 21అసెంబ్లీ స్థానాల్ని.. రెండు లోక్ సభా స్థానాల్ని సొంతం చేసుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 15 శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే పోటీ చేసినప్పటికీ అన్నింట్లోనూ విజయం సాధించటం ఒక ఎత్తు అయితే.. దాదాపు మూడు శాతం ఓట్లను అదనంగా దక్కించుకోవటం గమనార్హం. దీంతో.. జనసేనకు ఎన్నికల సంఘం గుర్తింపు రావటం ఖాయమని తెలుస్తోంది . ఇంతకాలం జనసేన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ హోదాలోనే ఉండేది. పార్టీ పెట్టి పదేళ్లు అయినా ఎన్నికల సంఘం గుర్తింపు పార్టీ స్థాయికి చేరలేదు.