Varahi Yatra: అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర

జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది.

  • Written By:
  • Updated On - September 29, 2023 / 08:05 PM IST

Varahi Yatra: జనసేనాని పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. సభా నిర్వహణకు ఏర్పాట్లను జనసేన నాయకులు ప్రారంభించారు. వారాహి వాహనంపై నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.

5 రోజులపాటు కొనసాగనున్న యాత్ర..(Varahi Yatra)

ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో మూడు దశలుగా పూర్తయిన వారాహి విజయ యాత్ర 4వ దశగా కృష్ణా జిల్లాలో 5 రోజులపాటు కొనసాగనుంది. అవనిగడ్డ బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని 2, 3 తేదీల్లో పవన్ కళ్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారు. 4వ తేదీ పెడన, 5వ తేదీ కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు.

కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే నాలుగో విడత వారాహి యాత్రను విజయవంతం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. వారాహి యాత్ర రాజకీయ పార్టీ యాత్ర కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నఅక్రమాలను ప్రజలకు తెలిపేందుకే యాత్రని ఆయన అన్నారు. పెడదారి పట్టిన యువతను మంచి మార్గంలో నడిపించడానికి వారాహి యాత్ర చేస్తున్నారని అన్నారు. సరైన విచారణ జరపకుండా వ్యక్తిగత కక్షలతో చంద్రబాబును అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.