CM KCR With Akhilesh Yadav:హైదరాబాద్‌కి చేరుకున్న సమాజ్‌వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో అఖిలేష్ యాదవ్‌కి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. బిఆర్ఎస్ ఎంపిలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
గత ఏడాది ఢిల్లీలో భేటీ..(CM KCR With Akhilesh Yadav)
గత ఏడాది సీఎం కేసీఆర్ అఖిలేష్ యాదవ్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. దేశంలో రాజకీయపరిస్దితులపై చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రతిపక్షనాయకులతో కేసీఆర్ అపుడు వరుస సమావేశాలు జరిపారు. అయితే తరువాత పెద్దగా ఆయన విపక్ష నేతలతో సమావేశాలు జరపలేదు. తెలంగాణలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆయన ప్రస్తుతం తెలంగాణపైనే దృష్టి కేంద్రీకరించారు. అయితే పక్కనే మహారాష్ట్రలో మాత్రం పర్యటిస్తూ ఇతర పార్టీలనుంచి వచ్చే నేతలను బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.