Vivek Venkataswamy: బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

అందరూ ఊహించినట్లుగానే బీజేపీ నేత,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ బిజెపికి షాకిచ్చారు. వివేక్‌తోపాటు ఆయన కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

  • Written By:
  • Updated On - November 1, 2023 / 01:17 PM IST

Vivek Venkataswamy:అందరూ ఊహించినట్లుగానే బీజేపీ నేత,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ బిజెపికి షాకిచ్చారు. వివేక్‌తోపాటు ఆయన కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

బీజేపీ పై అసంతృప్తితోనే..(Vivek Venkataswamy)

ప్రస్తుతం బిజెపి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న వివేక్ వెంకటస్వామి తన రాజీనామా లేఖని టిబిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. వివేక్ వెంకటస్వామికి మొదటి జాబితాలోనే ధర్మపురి అసెంబ్లీ టికెట్‌ని బిజెపి ఇచ్చింది. కానీ అసెంబ్లీకి పోటీ చేసేందుకు వివేక్ అయిష్టంగా ఉన్నారు. తన తరువాత పార్టీలో చేరిన ఈటల రాజేందర్‌కి బీజేపీ అధిష్టానం ప్రాధాన్యతనివ్వడం పట్ల వివేక్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం వివేక్ బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

నోవాటెల్ హోటల్‌లో రాహుల్ గాంధీతో వివేక్, వంశీ సమావేశమయి పార్టీ కండువాలను కప్పుకున్నారు.రాష్ట్ర విభజనకి ముందు టిఆర్ఎస్‌లో చేరిన వివేక్ తరువాత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. అనంతర పరిణామాలలో బీజేపీలో చేరి మరలా కాంగ్రస్ గూటికి చేరారు. ఈ సందర్బంగా వివేక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని అన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ లో చేరానని అన్నారు. తనకు టిక్కెట్టు కేటాయింపు అనేది పార్టీ నిర్ణయమని పేర్కొన్నారు.