Lagdapati Rajagopal: తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయదలచుకొలేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఫలితాలు ఎలా వుంటాయో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు.
ఉండవల్లి, హర్షకుమార్ అంటే నాకు ప్రేమ..(Lagdapati Rajagopal)
గతంలో రాష్ట్రంలో జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు మధ్య పోటీ ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహా ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ నడుస్తుందన్నారు. గతంలో లాగే తానేమి సర్వేలు నిర్వహించడం లేదని, పూర్తిస్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నానని అన్నారు. తన వ్యాపారం నిమ్మిత్తం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటున్నానని కాకినాడలో తన స్నేహితుడి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు వచ్చానని అన్నారు. హర్షకుమార్, ఉండవల్లి, తాను కలిసి ఢిల్లీలో ఎంపీలుగా కలిసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడామని చెప్పారు. కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగిన హర్షకుమార్, ఉండవల్లి తమ రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి పోరాటం చేసారని అందుకే వారంటే తనకు ప్రేమని చెప్పారు. వారు ఇద్దరు ఎక్కడనుంచి పోటీ చేసినా తాను వచ్చి వారి తరపున ప్రచారం చేస్తానని అన్నారు.అంతకు మించి తనకు రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. వైఎస్ షర్మిల తనకు చెల్లెలు లాంటిదని ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పడే చెప్పలేమన్నారు. షర్మిల చేసే కార్యక్రమాలను బట్టి ఉంటుందని అన్నారు. అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజలకు దగ్గరగా ఉన్నారని అన్నారు. ప్రజలకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా సమీక్ష చేస్తుంటారని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కూడా మర్యాదపూర్వకంగా లగడపాటి కలిశారు.ఏపీ ప్రభుత్వ పనితీరు, గురించి ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్‌ను ఆయన నివాసంలో లగడపాటి రాజగోపాల్ కలిశారు. ఇద్దరు కాసేపు అంతర్గతంగా సమావేశమై రాజకీయాలపై చర్చించారు.