Father Carries Oxygen Cylinder: విశాఖపట్నం కేజీహెచ్‌లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీషను కుటుంబసభ్యులు కేజీహెచ్ ప్రసూతివిభాగంలో చేర్పించారు. ఆమె నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు.
సిబ్బంది లేకపోవడంతో..(Father Carries Oxygen Cylinder)
దీనితో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు. అయితే ఆసుపత్రిలో సరైన సిబ్బంది లేకపోవడంతో పసికందును నర్సు ఎత్తుకెళ్లగా..వెనుక ఆక్సిజన్ సిలిండర్‌ను భుజాన వేసుకొని ఆమె వెంటవెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద ఆరా తీసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకూడదని ఆదేశించారు. ఇకపై పేషెంట్లను తరలించడానికి బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. మరోవైపు నెటిజన్లు ఈ వీడియో చూసి తండ్రి ప్రేమకు సెల్యూట్ అంటూ కామెంట్స్ చేసారు.