Janasena chief Pawan Kalyan: వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో ప్రతిసారీ చెట్లని కొట్టివేస్తుండటంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 07:07 PM IST

Janasena chief Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో ప్రతిసారీ చెట్లని కొట్టివేస్తుండటంపై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ హితవు పలికారు.

TREES

TREES 2

బాధ వాళ్ళకు ఎలా తెలుస్తుంది? (Janasena chief Pawan Kalyan)

వృక్షో రక్షతి రక్షితః .. వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి విరచిత పుష్ప విలాపం చదవనప్పుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు అర్థం కానప్పుడు- వృక్షాలను, మొక్కలను నరికేస్తుంటే కలిగే బాధ వాళ్ళకు ఎలా తెలుస్తుంది? కాబట్టే ఈ వృక్షాల నరికివేత సాగిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సిఎంకి తెలియకపోతే కనీసం చీఫ్ సెక్రటరీ అయినా చెట్లు కొట్టవద్దని సంబంధిత అధికారులకి చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరారు.

ఈ సందర్బంగా జంద్యాల పుష్పవిలాసం నుంచి దిగువ పంక్తులను పవన్ తన ట్వీట్ కు జత చేసారు.
ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..

అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ …