Double decker Buses: ‘రెండు అంతస్తుల బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్ అందాలను చూడటం ఒక గొప్ప అనుభూతి’.. ఇది ఓ నెటిజన్ చేసిన ట్వీట్.
ఇపుడు అదే ట్వీట్ అలనాటి చారిత్రిక డబుల్ డెక్కర్ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు కారణం అయింది.
నెటిజన్ చేసిన ట్వీట్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్ రోడ్డెక్కించనున్నట్టు అప్పుడే చెప్పారు.
ఆనాటి మాటను నిలబెట్టుకుంటూ డబుల్ డెక్కర్ అనుభవాన్ని నగర వాసులకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు.
పర్యావరణానికి హాని చేయని మూడు డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.
నిజాం కాలం నుంచి 2003 వరకు నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగాయి. మళ్లీ 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇపుడు నగరవాసులకు డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం వచ్చింది.
డబుల్ డెక్కర్ స్పెషాలిటీలివే..
ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో 65 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.
ఇవి పూర్తిగా విద్యుత్ తో నడుస్తాయి. ఒకసారి ఈ బస్సుకు చార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు.
2 నుంచి 3 గంటల్లో ఈ బస్సులు పూర్తిగా చార్జింగ్ అవుతాయి.
9.8 మీటర్ల పొడవు, 4.7 మీటర్ల ఎత్తు ఉన్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఖరీదు రూ. 2.16 కోట్లు
ఫార్ములా రేస్ లో ఫ్రీ రైడ్
ప్రస్తుతం ఈ మూడు డబుల్ డెక్కర్ బస్సులు ఈ నెల 11న హుస్సేన్‌సాగర్ తీరాన జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్‌ను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం నడపనున్నారు.
ఆ తర్వాత ఈ బస్సులను చారిత్రక , వారసత్వ కట్టడాల సర్య్కూట్ లలో నడుపుతారు. హైదరాబాద్ పర్యాటక ప్రాంతాలను ఈ బస్సుల్లో సందర్శించవచ్చు.
పర్యాటాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ బస్సుల నిర్వహణ ఉంటుంది.
ఫార్ములా రేస్ పోటీల సందర్భంగా డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేలా సదుపాయం కల్పించనున్నారు.
ఆరు నెలల్లో 25 డబుల్ డెక్కర్లు
కాగా , నగరంలో 20 డబుల్ డెక్కర్ బస్సులను వినియోగించేందుకు టీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ తాను చిన్నతనంలో ఆబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ స్కూలుకు డబుల్ డెక్కర్ బస్సుల్లో వెళ్లినట్లు ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ కు ఓ నెటిజన్ స్పందించాడు. దీంతో మళ్లీ వీటిని తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అప్పుడే కేటీఆర్ అధికారులను సూచించారు.
దాంతో హెచ్‌ఎండీఏ అధికారులు.. ముంబైకి చెందిన ఓ కంపెనీకి ఆరు డబుల్ డెక్కర్ బస్సులను ఆర్డర్ ఇచ్చారు.
ప్రస్తుతం మూడు బస్సులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో మూడు డబుల్ డెక్కర్లు నగరానికి రానున్నాయి.
మరో ఆరు నెలల్లో మొత్తం 25-30 డబుల్ డెక్కర్లను తెప్పిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కాగా.. డబుల్ డెక్కర్ బస్సులను ట్రయల్ రన్‌లో భాగంగా గచ్చిబౌలి-షేక్‌పేట్ ఫ్లై ఓవర్, ప్రశాసన్ నగర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45 ల మీదుగా నడిపించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/