Chandrababu Naidu: సైకో జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని, వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ నాశనమైందని అన్నారు.
ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు..( Chandrababu Naidu)
ఐదేళ్లలో సీఎం జగన్ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదని చంద్రబాబు విమర్శించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. రైతుల పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకని ఆయన ప్రశ్నించారు. అందుకే దాన్ని చించి తగలబెడుతున్నానంటూ ఒక పాసుసుస్తకం ప్రతిని చించి తగలబెట్టారు. మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా? లేక పెంచేవాడు కావాలా అంటూ అడిగారు.కోడికత్తి, గులకరాయి డ్రామాలాడని ప్రజలు నమ్మే పరిస్దితిలో లేరని చంద్రబాబు అన్నారు. ప్రజల జీవితాలను మార్చే సూపర్ సిక్స పధకాలతో ముందుకు వస్తున్నానని దీనికి మోదీ గ్యారంటీ కూడా కలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.