Site icon Prime9

Revanth Reddy: నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా? కేటీఆర్ ను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తన కొడుకుని మిస్సవుతున్నానంటూ మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్‌పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దూరంగా ఉన్న బిడ్డ గుర్తుకొచ్చి గుండె బరువెక్కుతోందా కేటీఆర్.. అని ప్రశ్నించారు. కొడుకుతో కొద్ది రోజుల ఎడబాటుకే ప్రాణం తల్లడిల్లిపోతోంది కదా.. అని అడిగారు.

ఉద్యోగంకోసం ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని, లక్షలాదిమంది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదనుకున్నావా? అని నిలదీశారు.సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక ఏడుస్తున్నారని తెలిసి అమ్మా నాన్నలు పడే ఆవేదన నీలా కాదనుకున్నావా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొడుకు తిరిగిరాక, పదేళ్లుగా ఏ సాయానికి నోచుకోక కుమిలి కుమిలి ఏడుస్తున్న అమరవీరుడి కుటుంబ యాతన నీలా కాదనుకున్నావా? అంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

30 మంది విద్యార్థుల ఉసురు తీసుకుని..(Revanth Reddy)

మీ గ్లోబరీనా కంపెనీ ఉసురు తీసిన 30 మంది ఇంటర్ విద్యార్థుల కన్నపేగుల ఆక్రందన.. నీలా కాదనుకున్నావా? అని రేవంత్ రెడ్డి మంత్రి కెటిఆర్‌ని ప్రశ్నించారు. తిండిపెట్టక చిన్నారులని ఏడిపించి, ఫీజు బకాయిలివ్వక యువతని గోసపెట్టి, ఉద్యోగాలివ్వక నిరుద్యోగులని వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపం తగిలి తీరుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Exit mobile version