Site icon Prime9

Telangana: తెలంగాణలో నామినేటెడ్ పదవులకి గుడ్ బై చెబుతున్న కార్పొరేషన్ చైర్మన్లు

telangana

telangana

Telangana: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తున్నారు. పలువురు ఓఎస్‌డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌లు తమ పదవులకు గుడ్‌బై చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం తన రాజీనామాను గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే.

రాజీనామాల పర్వం.. (Telangana)

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్‌రావు రాజీనామా చేశారు. టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బాధ్యతల నుంచి ప్రభాకరరావు వైదొలిగారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి కూడా రాజీనామా చేసారు. రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌ సోమ భరత్‌ కుమార్, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరి గౌరీ శంకర్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఛైర్మన్‌ పల్లె రవి కుమార్ గౌడ్, స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ డాక్టర్ ఆంజనేయ గౌడ్, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మేడె రాజీవ్ సాగర్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్ గూడూరు ప్రవీణ్ ఛైర్మన్‌, బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌ గజ్జెల నగేష్, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌ అనిల్ కూర్మాచలం, ట్రైకార్ ఛైర్మన్‌ రామచంద్ర నాయక్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఛైర్మన్‌ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్ సింగ్ తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రాజీనామా లేఖలు పంపించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ రద్దు..

రాష్ట్ర శాసనసభను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రద్దు చేశారు. భారత రాజ్యాంగంలోని 174(2)(బి) కింద ఆమెకు అందించిన అధికారాలను వినియోగించుకుంటూ ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ మూడో శాసనసభను ఏర్పాటు చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది మరియు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలను పంచుకుంది.ఈ మేరకు సోమవారం రాజ్‌భవన్‌లో చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ వికాస్‌ రాజ్‌, ఈసీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌కుమార్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో సమావేశమయ్యారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, వారి పార్టీ అనుబంధాల వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను సమర్పించారు.

Exit mobile version
Skip to toolbar