Visakha Railway Zone:విశాఖ రైల్వే జోన్ వ్యవహారం మరో సారి తెరపైకి వచ్చింది .విభజన హామీలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనీ కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే .అయితే ఇప్పటి వరుకు దీనిపైనా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు .ఈ క్రమం లో ఇటు కేంద్రం అటు రాష్ట్రం ఒకరు పై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి.
జాగ్రత్తగా మాట్లాడాలి..( Visakha Railway Zone)
ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి గా మారాయి .రైల్వే జోన్ ను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా అవసరమైన స్థలం ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు . దీన్ని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో కేటాయించిందని , అడ్డంకులు అన్నీ తొలగించి భూములు అప్పగించామని బొత్స అన్నారు. మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సందర్భంగా బొత్స పీయూష్ గోయల్‌కు సూచించారు. మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉండాలన్నారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఇకపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని పీయూష్ గోయల్ కు సలహా ఇచ్చారు.
ఇంతకీ పీయూష్ గోయల్ ఏమన్నారు?
ఏపీలో ఎన్నికల వేళ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది . కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు జగన్ ప్రభుత్వం పక్క దారి పట్టించిందని , అనేక ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. పనిలో పనిగా విశాఖ రైల్వే జోన్ పై కీలక వ్యాక్య చేసారు . విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టారని, కానీ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూములు జగన్ ప్రభుత్వం కేటాయించలేకపోయిందని ఎద్దేవా చేశారు. .ఏపీ అభివృద్ధికి ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, ఈ ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని పీయూష్ గోయల్ విమర్శించారు. కార్మికులు, రైతులు, యువతను అసలు పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ స్వార్ధ ప్రయోజనాలే చూసుకున్నారని, శాండ్ , ల్యాండ్ , లిక్కర్ మాఫియాలతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.రైల్వే జోన్ కు సంబందించిన వ్యాక్యల పై రాష్ట్ర మంత్రి బొత్స పై విధంగా స్పందించారు.