Kadapa: కడప కోఆపరేటివ్ కాలనీలో దారుణం జరిగింది. భార్య పిల్లల్ని గన్ తో షూట్ చేసిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తర్వాత ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇద్దరి భార్యల మధ్య ఆస్తి గొడవలు జరుగుతుండటంతో మొదటి భ్యార్యను హత్య చేసి తాను ఆత్మ హత్య చేసుకున్నాడు.
మరణ వాగ్మూలం రాసుకుని..(Kadapa)
కడపలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు రాత్రి పది వరకూ డ్యూటీలో ఉన్నాడు. ఇంటికి వెళ్లిన తర్వాత అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. తన మరణం తర్వాత వచ్చే బెనిఫిట్స్ ను తన రెండో భార్య కొడుక్కి ఇవ్వాలని మరణ వాగ్మూలం రాసుకున్నాడు.ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలు పెట్టారు. మరోవైసు కానిస్టేబుల్ రెండో భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.