Site icon Prime9

Revanth Reddy: అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు కేసీఆర్.. ప్రచారయావతో ప్రజల్ని మర్చిపోయారు 2023లో 2003 రిపీట్ అవుతుంది.. రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.బుధవారం హైదరాబాద్‌ నగరంలోని బోయినిపల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో శిక్షణా కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2003లో ఉన్న పరిస్దితులే 2023లో తెలంగాణలో వున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అపుడు విద్యార్దులు, రైతులు, కార్మికులు, మహిళలు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారని అన్నారు, అయితే చంద్రబాబు ప్రపంచానికే రాజు అంటూ మీడియా అభూత కల్పనలతో ప్రచారం చేసింది. వారిచేతిలో మీడియా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పోటీ ఇవ్వలేని పరిస్దితి ఉందని అనుకున్నారు. కాని ప్రజల్లో నమ్మకం పోతే ఏ మీడియా కూడా ఏమీ చేయలేదు. ఇపుడు కేసీఆర్ కూడా అలాగే అనుకుంటున్నారు. ఆనాడు పేదలకు అండగా ఉంది కాంగ్రెస్ పార్టీ. నాయకులు సమస్యల్లోనుంచే పుడతారు. కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాయి. మనమందరం కూడా కష్టపడితే కేసీఆర్ ఒక్క లెక్కలేదు. బండిలేదు గుండిలేదు ఎంతసేపు గుడిపేరుమీదనో, మతాలపేరుమీద పంచాయితీ పెట్టి గెలవాలని చూస్తున్నారు. సోనియమ్మ ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ఆశయాలను గ్రామగ్రామానికి తీసుకువెడదామని రేవంత్ అన్నారు.

రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్ర సందేశాన్ని ప్రతి గడపకు చేరవేసి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకే హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు. గత 8 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసగించిన బీఆర్‌ఎస్‌ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు చేయిచేయి కలపాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version